ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 22 (ప్రజా శంఖారావం):
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో వాయిదాలపై వాయిదాలు వేస్తూ బిజెపి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్గచర్చల అనంతరం పార్టీలో ముఖ్య నాయకులను ఎన్నికల బరిలో దించుతూ తొలి జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గం బిజెపి పార్టీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారస్తులు, అంకాపూర్ వాసి పైడి రాకేష్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధిష్టానం మొదటి జాబితాలో చోటు కల్పించింది. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.