నందిపేట్, అక్టోబర్ 24 (ప్రజా శంఖారావం):
నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఫ్లెక్సీ రూపంలో తన ఆవేదనను వెల్లడించాడు. తల్వేద గ్రామానికి చెందిన యువకుడు మాడ గంగాధర్ గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోసం చేసింది చాలు.. మోసపోయింది చాలు.. అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. నా కుటుంబానికి కుక్కర్, మందు వద్దని, నా పిల్లలకు కార్పొరేట్ లెవల్లో చదువుకావాలని, నా కుటుంబానికి మీరు ఇచ్చే చీరలు వద్దని, ఉపాధి కావాలని అంటూ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. కుటుంబానికి ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించే ఏ నాయకుడైనా తన ఇంటికి వచ్చి ఓటు అడగవచ్చునని ఫ్లెక్సీల రూపంలో పొందుపరిచి రాజకీయ నాయకులు అందించే ఉచితలపై మోసపోవద్దని తమ పిల్లల భవిష్యత్తు కోసం ఓటును అమ్ముకోవద్దనే సందేశాన్ని తన ఆవేదనను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం పై సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని 9 ఏళ్ల కాలం మోసం చేశారు. మోసం చేసింది చాలు అంటూ నిలదీశాడు ఒకింత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరోక్షంగానే నిలదీసినట్లు ఫ్లెక్సీ ఏర్పాటు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఓటును అమ్ముకోవద్దని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఓటరు ఆలోచించాలి అన్న సందేశం ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం పై పలువురు నెటిజన్లు యువకున్ని అభినందించారు.