*చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు
*సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దాడి
*దాడికి పాల్పడ్డ చెప్పాల గ్రామానికి చెందిన రాజు
*నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చేగుంట, అక్టోబర్ 30 (ప్రజా శంఖారావం):
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తూ
ప్రతి ఇంటింటికి వెళ్లి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన ఎంపీ. దొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజు ఎంపీ కి షేక్ హ్యాండ్ ఇస్తానని వచ్చి తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కత్తితో కడుపులో పొడిచాడు. ఈ దాడిలో ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటిన ఎంపీని ఆసుపత్రికి తరలించారు. ఎంపీపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని బిఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం ఎంపీపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపై దాడికి పలపడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై గజ్వేల్ వైద్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి ఎంపీని తరలించమన్నారు. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బరిలోకి ఉన్న విషయం తెలిసిందే.