ప్రత్యేక టీం/ఆర్మూర్ టౌన్, నవంబర్ 04 (ప్రజా శంఖారావం):
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజవర్గంలో ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టి తనిఖీ కేంద్రాలు అధికారులు లేక శనివారం మధ్యాహ్న సమయంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. విధి నిర్వహణలో అటుగా వెళుతున్న ప్రజా శంఖారావం దిన పత్రిక ప్రత్యేక విభాగం ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ జాతీయ రహదారి 63 ను అనుకొని ఉన్న ఆర్మూర్ అర్బన్ స్టాటిక్ సర్వే లైన్స్ టీం కేంద్రం, గోవింద్ పెట్ రహదారిలో ఉన్న ఆర్మూర్ రూరల్ స్టాటిక్ సర్వే లైన్స్ టీం కేంద్రాలు అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పడు చేసిన ఎస్ ఎస్ టి కేంద్రాల వద్ద ఆ టీం అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా అధికారులు లేక ఇలా ఖాళీగా దర్శనం ఇవ్వడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. విధులు నిర్వహించాల్సిన అధికారులు ఎక్కడ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి విధులు నిర్వహించాల్సిన అధికారులు ఎటు వెళ్లారో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారా? లేక తమకెందుకులే అని వదిలేస్తారా? వేచి చూడాలి.