ఆర్మూర్ టౌన్, నవంబర్ 09 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో అపశృతి. ప్రచార రథంపై నుండి మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి,
డాక్టర్ మధు శేఖర్ లు ప్రచార రథంపై నుండి కింద పడిపోవడంతో ఇరువురికి స్వల్ప గాయాలు. ఆర్మూర్ ఎంజె ఆస్పత్రిలో రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డికి చికిత్స చేసిన డాక్టర్లు. మంత్రి కేటీఆర్ కి స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్ వెళ్లిపోయిన మంత్రి కాన్వాయ్. రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డికి రెండు మోకాళ్ళకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ప్రచార రథం డ్రైవర్ ఒకసారిగా ర్యాలీలో సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం పై భాగంలో ఉన్న రేలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పెను ప్రమాదం తప్పిందని ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ప్రమాదం నుండి మంత్రి కేటీఆర్ తో పాటు తాము బయటపడ్డామని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, డాక్టర్ మధు శేఖర్ లు చెప్పారు.