పేకాట ఆడుతున్న 26 మంది అరెస్ట్

 ఆర్మూర్ టౌన్, నవంబర్ 13 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న స్థారవారాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల దాడులు చేయగా, పేకాట ఆడుతున్న 26 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 59,600 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా పేకాట ఆడుతున్న వారు పట్టుబడినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.