* మూడు తులాల పుస్తెలగొలుసు చోరీ
* పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
* మళ్లీ మొదలైన చైన్స్ స్నాచింగ్ లు
ఆర్మూర్ టౌన్, నవంబర్ 15 (ప్రజా శంఖారావం):
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు కట్టపై వెళుతున్న మహిళ మెడలోంచి 3 తులాల చైన్ చోరీ కలకలం రేపింది. మెట్పల్లి మండలం డబ్బ కు చెందిన మహిళ ఎల్లవ్వ తన భర్తతో కలిసి అరుంధతి నగర్ లోని తన కుమార్తె ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు మూడు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. అక్కడి నుండి దుండగుడు పల్సర్ బైక్ పై పారిపోయినట్లు వాపోయింది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.