* చెస్ బోర్డు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి
* రైతే రాజు పార్టీ అభ్యర్థి రూతే రవి
ఆర్మూర్ టౌన్, నవంబర్ 16 (ప్రజా శంఖారావం):
ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రైతే రాజు పార్టీ నుండి రూతే రవి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారంతో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు రైతే రాజు పార్టీ అభ్యర్థి రుతే రవికి చెస్ బోర్డ్ గుర్తును కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీలను చూసి కాదు అభ్యర్థిని చూసి ఓటు వేయాలని కోరారు. యువత, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నికలలో చెస్ బోర్డ్ గుర్తుకు ఓటు వేసి ఎన్నికలలో తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలలో ఓటు యొక్క విశిష్టత తెలియజేస్తూ, తమ పార్టీ యొక్క విధివిధానాలను వివరించడం జరుగుతుందని ఆయన చెప్పారు.