మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఆర్మూర్ టౌన్, నవంబర్ 18 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోగుల పూల నర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో శనివారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు. గతంలో సర్వసమాజ్ అధ్యక్షునిగా పనిచేసిన పూల నర్సయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, నాయకులను పట్టించుకోవడంలేదని దీంతో తాను బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్, పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, మీర్ మాజీద్, గిరి, మీసాల రవి, పెర్కిట్ ఆసిఫ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.