G-L53TNVHN5Y టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి | Praja Shankaravam

టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి

ఆర్మూర్, డిసెంబర్ 09 (ప్రజా శంఖారావం):

మాక్లూర్ మండలం సింగంపల్లి గ్రామ శివారులో, మాదాపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలపై జిల్లా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య వారి సిబ్బందితో కలిసి శనివారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా మొరం తరలిస్తున్న 2 జెసిబి లు, 4 టిప్పర్ వాహనాలతో పాటు 120 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనపరచుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.