G-L53TNVHN5Y అయ్యప్ప మహా పడిపూజ | Praja Shankaravam

అయ్యప్ప మహా పడిపూజ

 

ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 12 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గూడెం గురుస్వామి చక్ర వర్తుల పురుషోత్తమ చార్యుల ఆధ్వర్యంలో మంగళవారం బొండ్ల పెద్దులు గురు స్వామి అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నాగేష్ గురుస్వామి సమక్షంలో అరటి కొమ్మలతో అయ్యప్ప స్వామికి పడిని ఏర్పాటు చేసి వేదమంత్రోచ్చనాల నడుమ అభిషేకం చేశారు. ముందుగా గణపతి స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, సుబ్రమణ్య స్వామికి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం మంగళ హారతులతో దేవత మూర్తులకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మహా పడిపూజలో భాగంగా కనివిందు చేసే పడిని ఏర్పాటు చేశారు. ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఏర్పాటుచేసి అయ్యప్ప స్వాములు భక్తి గీతాలను ఆలపించారు. కన్నె స్వాములతో నగేష్ గురుస్వామి పేట తుల్లై అందించారు. ఈ మహా పడిపూజ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలంధర్, మీసాల రాజేశ్వర్, జనార్దన్ గౌడ్, మీసాల మహేష్, గోపి, యోగేష్, చేపూర్ ధనుంజయ్, సురేష్ అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.