G-L53TNVHN5Y అగ్ని ప్రమాదంలో బాలుడు మృతి | Praja Shankaravam

అగ్ని ప్రమాదంలో బాలుడు మృతి

 

ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 18 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పు అంటుకొని నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ జియావుద్దీన్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర్లో ఉన్న గడ్డివాము దగ్గర ఆడుకుంటూ ఉండగా వారే గడ్డివాముకు ఆడుకుంటూ మంట పెట్టారని తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు గదిలో ఉన్న గడ్డివాము తగలబడడంతో నాలుగేళ్ల బాలుడు గదిలో ఉండిపోయాడు, పొగలు దట్టంగా కమ్ముకోవడంతో బాలుడు ఊపిరిరాడక గదిలోనే కాలిపోయి మృతి చెందాడని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సురేష్ బాబు వెల్లడించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.