పేకాట స్థావరం పై దాడి 6గురు అరెస్ట్

ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 26 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతున్న 6గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 39,270 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పక్క సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఏఎస్ఐ లక్ష్మణ్ తో పాటు టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.