G-L53TNVHN5Y ప్రార్థన సమయానికి ప్రధానోపాధ్యాయురాలు ఆలస్యం | Praja Shankaravam

ప్రార్థన సమయానికి ప్రధానోపాధ్యాయురాలు ఆలస్యం

* సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
* ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పాఠశాల అభివృద్ధి
* మరోవైపు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
* ప్రధాన ఉపాధ్యాయురాలు సమయానికి రాని వైనం
* ట్రైనింగ్ ఉపాధ్యాయులు సైతం ఆలస్యం
* కొరవడిన మండల విద్యాధికారి పర్యవేక్షణ

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం 9:30 నిమిషాలకు పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడం “ప్రజా శంఖారావం” కెమెరాకు చిక్కింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ విద్యార్థుల కంటే ఆలస్యంగా వచ్చి గేటు బయట నిలబడడం పాఠశాలలో ఉపాధ్యాయుల పని తీరును కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఆమెతోపాటు మరి కొంతమంది ఉపాధ్యాయులు, ట్రైనింగ్ ఉపాధ్యాయులకు కూడా ఆలస్యంగా రావడం స్పష్టంగా కనబడింది. పాఠశాల తీరుపై మండల విద్యాధికారి రాజగంగారం పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతుంది. పాఠశాలకు సమయానికి రాని విద్యార్థులకు చెప్పాల్సింది పోయి ఉపాధ్యాయులే సమయానికి రాకుండా ఆలస్యంగా రావడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క పాఠశాలలో మౌలిక వసతుల కల్పన విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మౌలిక వసతిలో పాటు వంటశాల, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల ఏర్పాటుకు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేస్తుయిన్నారు. పాఠశాలలో స్థానికంగా జరుగుతున్న పనులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు తోటి సహచర ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి పరిశీలించాల్సింది పోయి పాఠశాలకే ఆలస్యంగా వస్తున్న వైనం. దీనికి తోడు “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రిక పాత్రికేయుడు ఈ ఘటనపై ప్రధాన ఉపాధ్యాయురాలిని వివరణ అడుగుదామని 15 నిమిషాల అనంతరం పాఠశాలకు వెళ్లి చూడగా మళ్లీ ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రధాన ఉపాధ్యాయురాలు గదిలో ఉన్న సిబ్బందిని అడగగా ఇప్పుడే మేడం బయటకు వెళ్లారని చెప్పడం కోసం మేరుపు. పాఠశాలకు ఆలస్యంగా రావడంతో పాటు వచ్చిన అనంతరం 10 నిమిషాల తర్వాత బయటకు వెళ్లారని చెప్పడం, తనకు వేల్పూర్ పాఠశాల ఇన్చార్జి తో పాటు ప్రజా పాలన కార్యక్రమం ఉందని బదులిచ్చారు. ఈ ఘటనపై జిల్లా శాఖ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో, స్థానిక ఎమ్మెల్యే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆదేశాలను ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.