G-L53TNVHN5Y 20 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | Praja Shankaravam

20 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ఆర్మూర్, డిసెంబర్ 31 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ అజయ్ బాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 20 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 85,200 రూపాయలు, 7 సెల్ ఫోన్లను  స్వాధీనపరచుకున్నట్లు వారు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తదుపరి విచారణ కోసం వారిని అప్పచెప్పినట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.