G-L53TNVHN5Y నెగ్గిన అవిశ్వాసం | Praja Shankaravam

నెగ్గిన అవిశ్వాసం

* అవిశ్వాస బల నిరూపణ సమావేశానికి హాజరైన కోరం సభ్యులు
* 20 మంది బిఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు, 4గురు బిజెపి కౌన్సిలర్లు హాజరు
* సమావేశానికి ప్రత్యేక అధికారిగా ఆర్డిఓ నియామకం
* అవినీతి పై గళం ఎత్తి అవిశ్వాసానికి బీజేపీ మద్దతు
* సమావేశానికి హాజరైన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జనవరి 04 (ప్రజా శంఖారావం):

గత 20 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడినట్లు అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై సొంత పార్టీ బిఆర్ఎస్ కౌన్సిలర్లు అసమ్మతి గలాన్ని వినిపిస్తూ గతంలో 12న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసి అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఈమేరకు ఈనెల 4న బల నిరూపణ కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని స్థానిక ఆర్డిఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అసమ్మతి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 20 మంది హాజరుకాగా, స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోపాటు బిజెపి పార్టీ కౌన్సిలర్లు 4గురు హాజరయ్యారు.

అవినీతి పై గళమెత్తుతూ అవిశ్వాసానికి బిజెపి మద్దతు

మొదటి నుండి బిఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవినీతి పై గళ మెత్తుతూ బిజెపి ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ జీవీ నరసింహారెడ్డి విమర్శన ఆస్త్రాలు సంధించారు. ఈమెరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అసంమతి కౌన్సిలర్లతో మద్దతు పలుకుతూ అవిశ్వాసానికి తీర్మానానికి మద్దతు తెలిపాలని నిర్ణయించారు. దీంతో అవినీతి ఆరోపణలు మోగించిన శంఖారావాన్ని పూరించినట్లుగా అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. బల నిరూపణ సమావేశానికి ఎక్స్ అఫీషియో ఓటు హక్కుతో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.