G-L53TNVHN5Y అంతర్ రాష్ట్ర మట్కా నిర్వాహకుడిని అరెస్ట్ | Praja Shankaravam

అంతర్ రాష్ట్ర మట్కా నిర్వాహకుడిని అరెస్ట్

* అనుచరుల కోసం పోలీసుల గాలింపు
* కోట్ల రూపాయల లావాదేవీలు
* మట్కా ఆడిన, నిర్వహించిన, బుకీలుగా వ్యవహరించిన చట్టరిత్యా చర్యలు
* ప్రజలు మోసపోవద్దని జిల్లా సిపి కల్మేశ్వర్ హెచ్చరిక

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, జనవరి 07 (ప్రజా శంఖారావం):

గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ జమీర్ అనే నిందితుడిని ఆదివారం నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సదరు నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా తన బుకీల ద్వారా అనేకమంది అమాయక ప్రజలని మట్కా వ్యాపారం లోకి లాగి వారికి డబ్బు ఆశ చూపి కోట్ల రూపాయలలో మోసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలిందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి తదితర ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాలతో మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్లు, బుకీలతో భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా విచారణలో తేలిందని వెల్లడించారు. జమీర్ ముఖ్య అనుచరుల గురించి గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడు కూడబెట్టిన ఆస్తులపై కూడా లోతైన విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు మట్కా ఏజెంట్లని నమ్మి మోసపోవద్దని అదేవిధంగా మట్కా ఆడిన, నిర్వహించిన, బుకీలుగా వ్యవహరించిన చట్టరిత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకోవడంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజు, నిజామాబాద్ ఏసిపి కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిఐలు అజయ్ బాబు, అంజయ్య, నార్త్ రూరల్ సీఐ సతీష్, ఐదవ పట్టణ ఎస్సై అప్పారావు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాములు, అనిల్, సుధాకర్, లక్ష్మన్న, రామచందర్, అజమ్ లను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా వారికి రివార్డులు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.