G-L53TNVHN5Y పేకాట స్థావరం పై దాడి 14 మంది అరెస్ట్ | Praja Shankaravam

పేకాట స్థావరం పై దాడి 14 మంది అరెస్ట్

ఆర్మూర్ టౌన్, జనవరి 07 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసిపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో పేకాట స్థావరం పై దాడి చేసి 14 మంది పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ₹ 22,040 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐలు అంజయ్య, అజయ్ బాబు లు తెలిపారు. వారిని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ కు అప్పచెప్పినట్లు చెప్పారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.