G-L53TNVHN5Y వివేకానంద జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం | Praja Shankaravam

వివేకానంద జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

*యువత రక్తదానానికి ముందుకు రావాలి..

కామారెడ్డి, జనవరి 07 (ప్రజా శంఖారావం):

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో స్వామి వివేకానంద జయంతి జనవరి 12 ను పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని,రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు లేకపోవడం వలన పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు తెలియజేయడంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు వారి యొక్క వివరాలను 9492874006 నంబర్ తెలియజేయాలని, రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, రక్తదాతల సమూహం ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్, కిరణ్, పుట్ల అనిల్, సలహాదారులు రమణ, ఎర్రం చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.