G-L53TNVHN5Y 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | Praja Shankaravam

16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

 

నిజామాబాద్ టౌన్, జనవరి 09 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సిఐలు అజయ్ బాబు, అంజయ్య లు తమ సిబ్బందితో కలిసి 6టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ₹ 39,470 రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తము వారిని 6 టౌన్ ఎస్ హెచ్ ఓకు అప్పగించినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.