ఏసీబీకి చిక్కిన మండల తహసిల్దార్

కడెం, (నిర్మల్), జనవరి 10 (ప్రజా శంఖారావం):

నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్నకు చెందిన 35 గుంటల భూమి పట్టా కొరకు స్థానిక మండల తాసిల్దార్ రాజేశ్వరిని సంప్రదించారు. తన పని కావాలంటే 15 వేల రూపాయలు ఇవ్వాలని తాసిల్దార్ డిమాండ్ చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ తాహసిల్దార్ చిన్నయ్యకు బాధితుడు 9వేల రూపాయలు ఇస్తుండగా ఎసిబి డిఎస్పి వెంకటరమణ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్ లను విచారిస్తున్నట్లు ఎసిబి డిఎస్పి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.