సామిల్ లో భారీ అగ్ని ప్రమాదం

 

కోరుట్ల, (జగిత్యాల), జనవరి 10 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. ప్రమాదవశత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. జనావాసాల మధ్యనే సామిల్ ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని సామిల్ బాధితులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.