G-L53TNVHN5Y గొడ్డలితో యువకుడి దాడి | Praja Shankaravam

గొడ్డలితో యువకుడి దాడి

సిరికొండ, జనవరి 10 (ప్రజా శంఖారావం):

సిరికొండ మండల కేంద్రంలో గొడ్డలితో దాడి చేసిన ఘటన పంది మడుగు గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దాడితో 4 ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరలలోకి వెళితే సిరికొండ మండలంలో తెల్ల వలుగు తాండాకు చెందిన సామాలు, అంబర్ సింగ్ లు గత కొంత కాలంగా గోవింద్ అనే వ్యక్తికి చెందిన 2 ఎకరాల పొలం కౌలు కు చేసుకుంటున్నారు. అదే తాండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ భాస్కర్ కొంత కాలం క్రిందట గోవింద్ కు చెందిన 2 ఎకరాల పొలం కొనడం కోసం డబ్బులు మధ్యవర్తి వద్ద ఉంచినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కానీ డబ్బులు గోవింద్ కి ముట్టక పోవడంతో పొలం అమ్మలేదు. కౌలు చేసుకుంటున్న అంబర్ సింగ్, సామాలు గోధుమ పంట వేయడంతో మంగళవారం రాత్రి కోతకు వచ్చిన గోధుమ పంటను ట్రాక్టర్ తో దున్నివేస్తుండటంతో అడ్డుపడ్డ అంబర్ సింగ్, సామాలు పైన గొడ్డలి, కొడవలి తో దాడి చేయగా తీవ్ర గాయాలు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సిఐ ని వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.