G-L53TNVHN5Y విజయవంతమైన రక్తదాన శిబిరం | Praja Shankaravam

విజయవంతమైన రక్తదాన శిబిరం

కామారెడ్డి, జనవరి10 (ప్రజా శంఖారావం)

తెలంగాణ దక్షిణ ప్రాంగణంలో గల సోషల్ వర్క్ విభాగం, ఎన్ ఎస్ ఎస్ ఐదు, ఆరవ యూనిట్ ల ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాంపస్ లోని ఆచార్యులు, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్త దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం అని, ప్రతీ ఒక్కరూ రక్త దానానికి ముందుకు రావాలని అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, తగిన బరువు కలిగిన ప్రతీ వ్యక్తి రక్త దానం చేయొచ్చని పిలుపునిచ్చారు. మన శరీరంలో మూడు నెలలలో మళ్లీ కొత్త రక్తం తయారవుతుందని తెలియచేస్తూ, రక్తడానానికి ఎలాంటి భయాలు అవసరం లేదని హితవు పలికారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం యూనిట్ 4, 5 వ కో ఆర్డినేటర్ లు డా .అంజయ్య, డా. హరిత, డా.మోహన్ బాబు, డా.సబిత, డా.వీరభద్రమ్, హాస్టల్ వార్డెన్ లు యాలద్రి, సునీత, ఏపీఆర్ఓ డా.సరిత పిట్ల, దిలీప్, డా. ఇంద్రకరణ్, డా.కనకయ్య, శ్రీకాంత్, కిషన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ రమేష్ రెడ్డి ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రమోద్, నూర్ సింగ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.