G-L53TNVHN5Y వైరల్ అవుతున్న ఎక్సైజ్ – బార్ ఓనర్ సంభాషణ | Praja Shankaravam

వైరల్ అవుతున్న ఎక్సైజ్ – బార్ ఓనర్ సంభాషణ

జగిత్యాల జిల్లా ప్రతినిధి, జనవరి 11 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ ఉన్నతాధికారినితో పాటు ఓ బార్ ఓనర్ మధ్య మద్యం గురించి మాట్లాడుకున్న వాదనలు ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇరువురి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెట్ పల్లి మండలంలోని ఓ బార్ ఓనర్ తో జరిగిన ఎక్సైజ్ అధికారి సంభాషణ ఇది.

బార్ ఓనర్: మేడం నమస్కారం. బెల్టు షాపుపై బార్ నుంచి మద్యం ఇచ్చారని రైడింగ్ చేశారట ఎందుకు మేడం.

అధికారిని: బెల్టు షాపులకు మద్యం వైన్స్ ల నుండి తీసుకురండి, కానీ బార్లలలో నుండి తీసుకురావద్దు.

బార్ ఓనర్: మా మీద ఏమైనా పగ పెట్టుకున్నారా మేడం.. బెల్టు షాపులకు వైన్స్ ల నుండి మద్యం తెచ్చుకోవాలని మాకు లీగల్ గా రాసి ఇవ్వండి. మీరు ఒక అధికారి అయి ఉండి బెల్ట్ షాపులకు మద్యం వైన్స్ లో నుండి తెచ్చుకోవాలని ఎలా అంటారు.

అధికారిని: ఇవన్నీ కాదండి మీరు బార్ లో మద్యం బయటకు ఇవ్వరాదు. మీది ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు ఎవరికైనా చెప్పొచ్చు నిబంధన ప్రకారం నేను వెళ్తున్నాను.

బార్ ఓనర్: మేము మంత్రిని కలుస్తాం.

అధికారిని: మంత్రి కాదు మీరు ఎక్కడికైనా వెళ్లి ఏ ఫిర్యాదు అయినా చేయొచ్చు నేను ఏమీ అనను మీరు చేసుకునే పని మీరు చేయండి, నా విధులు నేను నిర్వహిస్తా.

బార్ ఓనర్: నీ మాటలాన్ని నా ఫోన్లో రికార్డు అయ్యాయి .

అధికారిని: నాది 14 ఏళ్ల సర్వీస్, నా ఫోను రోజంతా రికార్డు అవుతూనే ఉంటది. నేను బెదిరిస్తే భయపడి అధికారిని కాదు నేను. ఇప్పటివరకు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడను మీరు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేస్తున్నానని అంటే నేనేం అనుకోవాలి. మీరు ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు.

బార్ ఓనర్: బార్లు, వైన్స్ ల విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు.

అధికారిని: బార్ వాళ్లు బయటకు మద్యం ఇవ్వరాదు.
బెల్టు షాపులు నడవకుండా వాటిని బందు చేయిస్తాం.

బార్ ఓనర్: ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చూడండి మేము నిబంధన ప్రకారం నడుచుకుంటాం.

అధికారిని: ఇప్పటివరకు మీరు ప్రతిదీ రూల్స్ ప్రకారం నడిపించారు కదా ఇప్పుడు కూడా అదే మాదిరిగా నడిపించండి నిబంధన ప్రకారం నడిపిస్తే మాకు ఎలాంటి సమస్య ఉండదు. ఇలా వీరిద్దరి సంభాషణ ఇప్పుడు మెట్ ల్లిలో ఎవరి ఫోన్లో చూసినా చర్చనీయాంశంగా మారి ఫోన్లలో తిరుగుతుంది. ప్రభుత్వం ఓపక్క బెల్టు దుకాణాలను నడిపించకుండా చర్యలు తీసుకోవాలని దృష్టి సారిస్తే, ఇక్కడ మాత్రం బెల్టు షాపులపై అధికారిని మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.