G-L53TNVHN5Y అమ్మక్కపేట గ్రామ శివారులో చిరుత పులుల సంచారం | Praja Shankaravam

అమ్మక్కపేట గ్రామ శివారులో చిరుత పులుల సంచారం

* భయందోళనలో అమ్మక్కపేట గ్రామస్తులు

ఇబ్రహీంపట్నం, జనవరి 17(ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట గ్రామ శివారులోని వ్యవసాయ భూములలో,చెరుకు తోటలలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామ శివారులోని అటవీ ప్రాంతం వెంబడి, వ్యవసాయ తోటలలో చిరుతపులి సంచరిస్తునట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతం నుండి చిరుత పులులు ఉదయం వేళ గ్రామస్తులకు కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓ రైతుకు చెందిన తోటల నుండి పులి వెళ్లినట్లు అటవిశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఎఫ్ ఆర్ వో షౌకత్ అలీ అక్కడకు చేరుకోని చిరుత పులి పగుసును (అడుగులు) పరిశీలించారు. ఎ జంతువు అనేది గుర్తించేందకు అటవీ ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో పూర్తి నిఘ చేపడుతున్నాట్లు షౌకత్ అలీ తెలిపారు. సంచారం ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగ గతకోన్ని రోజుల క్రితమే పక్కన ఉన్న సత్యక్కపల్లె గ్రామంలో సంచరించిన పులి అమ్మక్కపేట గ్రామ శివారుకు వచ్చి ఉండవచ్చాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.