G-L53TNVHN5Y చిరుతపులి సంచారం కలకలం | Praja Shankaravam

చిరుతపులి సంచారం కలకలం

 

మెట్ పల్లి, జనవరి 24 (ప్రజా శంఖారావం):

సత్తక్కపల్లి, ఎర్రపూర్, అమ్మక్కపేట గ్రామ శివారులో చిరుత సంచరిస్తునట్లు కలకలం. వ్యవసాయ తోటలో చిరుత పాదం గుర్తులను గ్రామస్తులు చూసినట్లు చెబుతున్నారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదాల అడుగులను అధికారులు పరిశీలించారు. పూర్తి నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లొద్దని రైతులకు అధికారులు సూచించారు. కళ్ళు గీత కార్మికులకు అడవికి వెళ్లొద్దని హెచ్చరించారు. గత పది రోజుల నుంచి మూడు గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.