G-L53TNVHN5Y గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల అశ్రద్ధ | Praja Shankaravam

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ అధికారుల అశ్రద్ధ

 

ఆర్మూర్ టౌన్, జనవరి 26 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ కెనాల్ పక్కన ఉన్న 100 అడుగుల జాతీయ జెండా పట్ల మున్సిపల్ అధికారుల అశ్రద్ధ కొట్టొచ్చినట్లు కండ్లకు కనబడింది. శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేయాడానికి జెండాను సిద్ధం చేశారు. కానీ జెండా సగ భాగం నేలకు ఆనిచ్చి పెట్టడంతో పాటు, జాతీయ జెండా పట్ల అశ్రద్ధ వహించి ఉదయం 10:30 గంటలు అవుతున్న జెండాను ఎగురవేయక పోవడం పట్ల స్థానికులు కొందరు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులపై విమర్శలు వెల్లువేవెత్తాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న జాతీయ జెండాను అవమానపరిచే విధంగా అధికారులు అశ్రద్ధ వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు ఈ ఘటనకు బాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.