బీఆర్ఎస్ నేతల సమక్షంలో జాతీయ జెండాకు అవమానం

 

ఆర్మూర్ టౌన్, జనవరి 26 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దె వద్ద శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో జాతీయ జెండాకు అవమానం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి అశన్న గారి రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో జాతీయ జెండా ఎగరకపోవడంతో మళ్లీ కిందికి దించి ఆ తర్వాత జెండాను అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బంది జెండా సరిచేయడంతో తిరిగి ఆవిష్కరణ గావించారు. ఘటన పట్ల స్థానికంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా ఆవకాయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు ఆకుల రాము, ఇట్టేడి నర్సారెడ్డి, బారడ్ రమేష్, బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, నాయకులు పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, జి జి రామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.