G-L53TNVHN5Y ప్రజావాణిలో ఎస్ఐపై ఫిర్యాదు | Praja Shankaravam

ప్రజావాణిలో ఎస్ఐపై ఫిర్యాదు

జగిత్యాల ప్రతినిధి, జనవరి 30 (ప్రజా శంఖారావం):

ఇబ్రహీంపట్నం మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉమాసాగర్ పై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బండలింగాపూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని రాజేశ్వర్రావుపేట గ్రామంలోని ఓ స్థల విషయంలో ఎస్సై పోలీస్ స్టేషన్ కు పిలిచి బండ బూతులు తిడుతున్నాడని, అమర్యాదగా ప్రవర్తిస్తూ అక్రమ కేసులు బనాయించి కాల్చి చంపేస్తానంటూ బెదిరించడం పై బాధితుడు సామ లక్ష్మారెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.