G-L53TNVHN5Y బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Praja Shankaravam

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

 

కోరుట్ల, జనవరి 30 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి విచారణ చేశారు. అమ్మాయి వయసు 14 ఏళ్లుగా తేలడంతో కుటుంబసభ్యులపై పొలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.