G-L53TNVHN5Y పట్టపగలే రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు | Praja Shankaravam

పట్టపగలే రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు

 

మల్లాపూర్, ఫిబ్రవరి 10 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులో పట్టపగలే చైన్ స్నాచర్లు మహిళ రైతు మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు తెంపుకొని పరారయ్యారు. వేంపల్లి గ్రామానికి చెందిన సకినపల్లి రాజు (60) అనే మహిళ రైతు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు మాట మాట కలిపి వివరాలు అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు చైనును ఎత్తుకెళ్లి అక్కడినుండి పరారయ్యారు.పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.