G-L53TNVHN5Y అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్ | Praja Shankaravam

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

ఆర్మూర్, ఫిబ్రవరి 11 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి 63 పై ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని స్థానిక ఇసుక వ్యాపారులు పట్టుకున్నారు. జిల్లా మైనింగ్ అధికారి టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వర్ కు సమాచారం ఇవ్వడంతో ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని ఆయన సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీజ్ చేసిన TS 16 UA 6215 నెంబర్ గల లారీని ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో పార్క్ చేయించినట్లు చెప్పారు. ఉన్నత అధికారులకు నివేదికను అందజేస్తానని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.