G-L53TNVHN5Y ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు | Praja Shankaravam

ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు

ఆర్మూర్, ఫిబ్రవరి 11 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో అబ్బ రాజేశ్వర్ స్మారక ఉమ్మడి జిల్లాల కబడ్డీ టోర్నమెంట్ ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అథితులుగా కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఫత్తేపూర్ శ్రావణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజు భాయ్, చిట్టి రెడ్డి, భూపేందర్, పుట్టి మురళి, శ్రీకాంత్, లవన్, నవీన్ రెడ్డి లు పాల్గొని సెమి ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డ నిజామాబాద్ టీం, సుర్బిర్యాల్ ఏ టీం సభ్యులను పరిచయం చేసుకున్నారు. మొత్తం 36 జట్లు ఈ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఇరు జట్ల టీం సభ్యులకు అల్ దిబేస్ట్ చెప్పి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలను దిలీప్ ఆయన తండ్రి స్మారకార్థం నిర్వహించినట్లు తెలిపారు. ఆయన తండ్రి మంచి కబడ్డీ క్రీడకారుడని, ఆయన స్మారకర్తకంగా ఈ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడలను నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. ఎన్నో పోటీల్లో ఆయన పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పోటీలకు అంబేద్కర్ యూత్ సభ్యులు సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ విడిసి సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.