G-L53TNVHN5Y కాంగ్రెస్ పార్టీలో చేరిన సొసైటీ చైర్మన్ | Praja Shankaravam

కాంగ్రెస్ పార్టీలో చేరిన సొసైటీ చైర్మన్

ఆర్మూర్ టౌన్, ఫిబ్రవరి 14 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలోని పివిఆర్ భవన్లో బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెర్కిట్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పెంట భోజ రెడ్డి తోపాటు సొసైటీ డైరెక్టర్లు చింతకుంట రాజు, సోక్కం ముత్యమ్మ, కటిక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మండల మాజీ అధ్యక్షులు డేరమోహన్, ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు సుభాష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆయన వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్, మైనారిటీ నాయకులు అజ్జు, ఫయుమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిమ్మి రవి, మాజీ కౌన్సిలర్ పూల నర్సయ్య, కొంతం మురళి, రాజు భాయ్, చిట్టి రెడ్డి, భూపేందర్, ప్రసాద్, శ్యామ్, నయుం, బబ్లు, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.