G-L53TNVHN5Y గ్రామ అభివృద్ధి పనులకు నిధులు | Praja Shankaravam

గ్రామ అభివృద్ధి పనులకు నిధులు

 

ఆర్మూర్, ఫిబ్రవరి 15 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మండలం చేపూర్, కోమన్ పల్లి, ఫత్తేపూర్, గ్రామాలలో గ్రామ అభివృద్ధి పనుల పై గ్రామస్తులతో కలిసి గురువారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తుల వద్ద అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయిస్తానని, ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక అధికారులు గ్రామస్తులతో కలిసి చర్చించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకర్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.