G-L53TNVHN5Y చెరకు ఫ్యాక్టరీకి తాళం వేసిన రైతులు | Praja Shankaravam

చెరకు ఫ్యాక్టరీకి తాళం వేసిన రైతులు

 

మెట్ పల్లి, ఫిబ్రవరి 15 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కార్యాలయానికి చెరుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. మల్లాపూర్ మండలం రాఘవ పేట గ్రామానికి చెందిన దాదాపు 20 మంది రైతులు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఒప్పందంతో దాదాపు 22 ఎకరాలలో చెరుకు పంట వేశారు. ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా చెరుకు కటింగ్ వర్కర్స్ ను పంపిoచ కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. మరో పది రోజులలో ఫ్యాక్టరీ క్రషింగ్ ఆగిపోతుందని, తర్వాత తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే స్పందించి తమ చెరుకును కటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Leave A Reply

Your email address will not be published.