G-L53TNVHN5Y నేషనల్ హైవే బైపాస్ సర్వేను అడ్డుకున్న రైతులు | Praja Shankaravam

నేషనల్ హైవే బైపాస్ సర్వేను అడ్డుకున్న రైతులు

మెట్ పల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామం నుండి వెళ్తున్న ప్రపోజల్ బైపాస్ రోడ్ సర్వేను సర్వే చేయనీయకుండా వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు వల్ల తమ విలువైన భూములను కోల్పోతున్నామని, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తమకు సరిపోదని వాపోయారు. కోట్ల రూపాయల విలువైన భూములను లక్షల్లో పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు వల్ల కోట్ల రూపాయల విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.