G-L53TNVHN5Y వినయ్ రెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం | Praja Shankaravam

వినయ్ రెడ్డి చొరవతో 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం

 

ఆర్మూర్, ఫిబ్రవరి 22 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో 26 మంది నర్సింగ్ స్టాఫ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయని ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నాగరాజు గురువారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజల అవసరాల నిమిత్తం, ప్రజారోగ్యం బాగుపడాలన్న సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి స్థానిక ఆర్మూర్ ఆసుపత్రి పరిస్థితులు, సిబ్బంది కొరతపై స్థానిక సమస్యలపై ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పొద్దుటూరి వినయ్ రెడ్డి నివేదిక అందజేశారు. సత్వరమే స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి 26 మంది నర్సింగ్ స్టాఫ్ ను నియమిస్తూన్నట్లు సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వైద్యుల కొరతపై కూడా త్వరలోనే నియామకాలను చేపడతామని ఆసుపత్రిలో ఉన్న ఇక్విప్మెంట్స్ పై ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయిలో 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వినయ్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు వినయ్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి సమస్యలపై స్పందించి పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు కోరుతున్నారు. 100 పడకల ఆసుపత్రి సిబ్బంది నియామకంపై కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి వినయ్ రెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.