G-L53TNVHN5Y మెట్ పల్లిలో కత్తి పొట్ల కలకలం | Praja Shankaravam

మెట్ పల్లిలో కత్తి పొట్ల కలకలం

 

మెట్ పల్లి, ఫిబ్రవరి 28 (ప్రజా శంఖారావం):

కుటుంబ కలహాలతో తండ్రి పై కత్తితో దాడికి దిగిన ఘటన మెట్ పల్లి పట్టణంలోనీ అరపేటలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరారాల ప్రకారం. అరపేటలో రిజ్వాన్ ఖాన్ పై కొడుకు అక్బర్ ఖాన్ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా అక్బర్ ఖాన్ భార్య మనస్పర్ధలతో తల్లి తండ్రుల వద్ద ఉంటుంది. అయితే నా భార్య నాకు కావాలని అక్బర్ ఖాన్ బుధవారం తల్లిదండ్రులపై గొడవకు దిగగా తల్లిని కత్తితో పొడిచే క్రమంలో తండ్రి రిజ్వాన్ ఖాన్ అడ్డుపడగ ఆయనకు ఛాతి కింద కడుపులో కత్తిపోట్లు కావడంతో మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.