G-L53TNVHN5Y విప్ ధిక్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు | Praja Shankaravam

విప్ ధిక్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

* మున్సిపల్ చైర్పర్సన్ గా ఆడువాల జ్యోతి ఎంపిక

జగిత్యాల, ఫిబ్రవరి 28 (ప్రజా శంఖారావం):

జగిత్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ జారీ చేసిన విప్ ను కౌన్సిలర్లు దిక్కరించడంతో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి సమిండ్ల వాణీ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటు వేయడంతో తిరుగుబాటు అభ్యర్థి అడువాల జ్యోతి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ తిరుగుబాటు వెనక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. ఆడువాల జ్యోతి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అడువల జ్యోతి మళ్లీ అదే కాంగ్రెస్ సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బోగ శ్రావణి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా పలు అరోపణలు చేస్తూ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన అడువాల జ్యోతికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే ను కోరారు. కానీ తాను గతంలో సమిండ్లా వాణి శ్రీనివాస్ కు మాట ఇచ్చానని అందుకు అనుగుణంగా ఈసారి ఆమెను ఎన్నుకోవాలని కౌన్సిలర్లను కోరారు. కొంతమంది కౌన్సిలర్లతో కలిసి గోవాలో క్యాంపు నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది. చైర్ పర్సన్ ఎన్నికలో 12మంది బీఆర్ఎస్, 7 గురు కాంగ్రెస్, బీజేపీ 2, ఇండిపెండెంట్ 02, ఎంఐఎం 01 కౌన్సిలర్లు పాల్గొన్నారు. తన సమీప ప్రత్యర్థి సమిండ్ల వాణి పై ఒక్క ఓటు ఆధిక్యంతో ఆడువాల జ్యోతి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.