G-L53TNVHN5Y కత్తులతో దాడులు… అమానుష ఘటన | Praja Shankaravam

కత్తులతో దాడులు… అమానుష ఘటన

 

* క్షతగాత్రుల ఆసుపత్రికి తరలింపు
* ప్రాణ భయంతో పరుగులు తీసిన జనాలు

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 02 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం గణేశ్‌పల్లి గ్రామంలో కుల సంఘ చీటీపాట విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ. కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్న ఇరు వర్గాలు. 6గురికి గాయాలు కాగా క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఒక్కసారిగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారి ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దింతో స్థానికులు ప్రాణ భయంతో కొందరు పరుగులు తీశారు.

Leave A Reply

Your email address will not be published.