G-L53TNVHN5Y ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడి దారుణ హత్య | Praja Shankaravam

ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడి దారుణ హత్య

 

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 04 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామంలో ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సోమవారం గ్రామంలో ఓ యువతి కోసం మహేష్ అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. దీంతో ఆ యువకుడిపై యువతీ కుటుంసభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ యువకుడు వారిని ప్రతుఘటిస్తూ కత్తితో వారిపై ఎదురు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తల్లి, తాతకు గాయాలైయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో యువతీ కుటుంబసభ్యులు అందరు ఒకేసారి యువకుడి పై దాడికి పాల్పడటంతో మహేష్ అక్కడిక్కడే మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.