G-L53TNVHN5Y ప్రమాదవశాత్తు కారు దగ్ధం | Praja Shankaravam

ప్రమాదవశాత్తు కారు దగ్ధం

 

కథలాపూర్, మార్చి 07 (ప్రజా శంఖారావం):

వేములవాడ దర్శనానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు కారు దగ్ధం అయింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి జంగం ప్రేమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కారులో మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పోసానిపేట గ్రామ శివారుకు చేరుకునేసరికి కారు నుండి పొగలు వస్తూ మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేసరికి కారు మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేవని క్షేమంగా బయట పడ్డట్లు వెల్లడించారు. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.