G-L53TNVHN5Y ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా… | Praja Shankaravam

ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా…

* పలువురికి గాయాలు…
* క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 09 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడిన సంఘటన మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు లక్షెట్టిపేట మండలం మ్యాదరిపేట కు చెందిన వారిగా గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.