G-L53TNVHN5Y నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్ | Praja Shankaravam

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

* నలుగురు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా సభ్యులు అరెస్ట్

* వారి వద్ద ల్యాప్ టాప్, నకిలీ సర్టిఫికెట్లు, నగద నగదు స్వాధీనం

* వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 09 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తూ, ఎలాంటి విద్యర్హతలు లేకున్నా సర్టిఫికెట్లను తయారు చేస్తూ అమాయకుల వద్దనుండి డబ్బు సంపాదించడమే పనిగా పలువురికి నకిలీ విద్యాసర్టిఫికెట్లను తయారు చేసి అమ్ముతున్న ముఠాను జగిత్యాల పోలీసులు చాకచన్యంగా పట్టుకున్నాట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు వివరాలను ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జైన గ్రామానికి చెందిన మహేష్ గల్ఫ్ లో ఉద్యోగం నిమిత్తం 10వ తరగతి విద్యార్హత వున్న సర్టిఫికెట్ అవసరం వుండగా కరీంనగర్ జిల్లాకు చెందిన రజితకు 28వేల రూపాయలను ఇవ్వగా నకిలీ సర్టిఫికెట్ల ఇచ్చినట్లు తెలిసిందని చెప్పారు. దీంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీలో పోలీసులు కూపీ లాగగా 10వ తరగతితో పాటు డిగ్రీ ఇతర విద్యార్హతలు ఉన్న సర్టికేట్ లు తయారుచేస్తున్నారని, ఈముఠాలో నలుగురు రజిత, శ్రావణ ,మహేష్, చంద్రయ్యల ప్రమేయం ఉన్నట్లు తేలిందని తెలిపారు. వీరు ఇప్పటి వరకు వేస్ట్ బెంగాళ్ లో రబీ, లక్ష్మి రాయ్ ల ద్వారా నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసి 100మందికిపైగా సర్టిఫికెట్ల ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని ఆయన అన్నారు. వీరు పలువురినీ మోసంచేస్తు రకరకాల యూనివర్సిటీ పేర్లతో నకిలీ సర్టిఫికెట్ల అమ్ముతున్నారని ఎస్పీ వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోలీసులు వీరిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి వద్ద నుండి 395 ఫేక్ సర్టిఫికెట్లు, 5 మొబైల్ ఫోన్లు, 25 వేల నగదు, ఒక లాప్టాప్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నమని జిల్లా ఎస్పీ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.