G-L53TNVHN5Y మున్సిపల్ అధికారుల కక్షసాధింపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బాధితుని వాయిస్ మెసేజ్… | Praja Shankaravam

మున్సిపల్ అధికారుల కక్షసాధింపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బాధితుని వాయిస్ మెసేజ్…

 

*కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్ళిన బాధితుడు
* మూడురోజులుగా ఇల్లు కూల్చివేస్తున్న అధికారులు
*మాజీ కౌన్సిలర్ ప్రోద్బలంతోనే మున్సిపల్ అధికారులు అన్యాయం చేశారని బాధితుడు ఆరోపణ

కోరుట్ల, మార్చి 09 (ప్రజా శంఖారావం):

కోరుట్ల పట్టణ కేంద్రంలోని కల్వగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్ నిర్మించుకున్న ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని దఫల వారీగా మూడురోజుల పాటుగా మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ సంఘటనతో మన స్థాపనకు గురైన బాధితుడు కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. దీనికి సంబందించిన వాయిస్ మెసేజ్ ఒకటి సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. మున్సిపల్ అధికారుల కళ్లముందే ఎన్నో బడాబాబుల అక్రమ నిర్మాణాలు ఉండగా వాటిని పట్టించుకోకుండా మధ్యతరగతికి చెందిన తమపై చర్యలు ఏంటని మహేష్ వాపోయాడు. మాజీ కౌన్సిలర్ ప్రోద్బలంతోనే తమకు మున్సిపల్ అధికారులు అన్యాయం చేశారని బాధితుడు ఆరోపించారు. కోరుట్ల మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.