G-L53TNVHN5Y తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ | Praja Shankaravam

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

 

మెట్ పల్లి, మార్చి 12 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని వెంకట్రావ్ పేట్ క్రిస్టియన్స్ కాలనీలో నివాసం ఉంటున్న తిమ్మని విజయ నిర్మల ఇంట్లో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం తిమ్మని విజయనిర్మల ఆమె సోదరుని శుభాకార్యానికి సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లగా మరుసటి రోజు మంగళవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 30తులాల వెండి, ఒక లాప్ టాప్, 30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు వాపోయింది తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం తో ఆధారాల కోసం వెతుకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.