G-L53TNVHN5Y మెడికల్ దుకాణం సీజ్… | Praja Shankaravam

మెడికల్ దుకాణం సీజ్…

 

మెట్ పల్లి, మార్చి 12 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ దుకాణాన్ని మంగళవారం ఔషధ నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. నరసయ్య ఆధ్వర్యంలో తనిఖీ చేసి సీజ్ చేశారు. అనంతరం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వి. ఉపేందర్ మాట్లాడుతూ పట్టణంలోని లైఫ్ లైన్ మెడికల్ పేరుతో ఉన్న మెడికల్ షాప్ జూలై-2018 సంవత్సరం నుండి మెట్ పల్లి పట్టణంలో కొనసాగుందిని, మెడికల్ షాపు లైసెన్స్ గడవు జనవరి-2024 తో ముగిసినప్పటికీ షాపు యజమాని రెన్యువల్ చేసుకోలేదని వెల్లడించారు. అనుమతులు లేకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడన్న సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేసి షాపులో ఉన్న పలు రకాల అల్లోపతిక్ మందులను స్వాదిన చేసుకుని లైఫ్ లైన్ మెడికల్ షాప్ ను సీజ్ చేశామని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జప్తు చేసిన మందులను విచారణ నిమిత్తం మెట్ పల్లి కోర్టుకు అందజేస్థామని అన్నారు. ఈ తనిఖీల్లో నియంత్రణశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసయ్యతోపాటు ఇతర జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా పాల్గొన్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.