G-L53TNVHN5Y అక్రమ మైనింగ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు | Praja Shankaravam

అక్రమ మైనింగ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు

మాక్లూర్, మార్చి 13 (ప్రజా శంఖారావం):

మాక్లూర్ మండల పరిధిలోని చిన్నాపూర్ గ్రామం సింగంపల్లి శివారులో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న మొరం తవ్వకాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సిబ్బందితో కలిసి బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమ మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జెసిబి లు, 21 తిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమ మైనింగ్ మొరం తవ్వకాలపై స్థానిక మాకూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాహనాలను అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్, రాజేశ్వర్, రాములు, గజేందర్, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.